నారద వర్తమాన సమాచారం
పుట్టినరోజు సందర్భంగా నిరుపేద చేనేత కార్మికులకు 50 వేల ఆర్థిక సహాయ వితరణ
చేనేత కార్మికులకు చెక్కులను అందజేస్తున్న టిఆర్ యువసేన ప్రతినిధులు
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో మంగళవారం అర్బన్ బ్యాంక్ చైర్మన్, టై అండ్ డై ట్రస్ట్ చైర్మన్ తడ్క రమేష్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక రజతోత్సవ ప్రారంభంలో టి ఆర్ యువసేన ప్రతినిధులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద చేనేత కార్మికులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి పాలాది యాదగిరి మాట్లాడుతూ పుట్టినరోజు పేరిట ఎంతోమంది వృధా ఖర్చులు చేస్తున్న నేపథ్యంలో ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి ప్రభుత్వం అందించే చేనేత పొదుపు పథకాన్ని కట్టలేని స్థితిలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో వారు ఐదుగురు నిరుపేద చేనేత కార్మికులను ఎంచుకొని ప్రతి సంవత్సరం పొదుపు పథకానికి సంబంధించిన గ్రాంట్ ని 50వేల చొప్పున పుట్టినరోజు సందర్భంగా సంవత్సరానికి ఐదుగురికి చెక్కులు అందిస్తూ వస్తున్నాడని ఆయన తెలిపారు. సేవ అనే లక్ష్యంగా నిరుపేదలను ఆదుకునే ఉద్దేశంగా ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నాడని ఆయన తెలిపారు. ఇటీవల అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైన అతను బ్యాంకు నుంచి వచ్చే గౌరవ జీతభత్యాలని పూర్తిగా నిరుపేదల చదువు వైద్య ఖర్చుల పేరిట ఖర్చు చేస్తానని హామీ ఇచ్చాడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు చేనేత నాయకులు చింతకింది రమేష్, పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు మెరుగు శశికళ, మార్కండేయ స్వామి దేవాలయం కోశాధికారి మంగళపల్లి రాజా రమేష్, టై అండ్ డై ప్రధాన కార్యదర్శి ముస్కూరి నరసింహ, టి ఆర్ యువసేన అధ్యక్షులు వలందాస్ ప్రవీణ్, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజి సమాఖ్య గౌరవ అధ్యక్షులు సీత పాండు, అధ్యక్షులు కోడి బాలరాజు, చేనేత నాయకులు తడక వెంకటేష్, కడవేరు హనుమంతు, కర్నాటి పురుషోత్తం, తుమ్మ అంబదాసు, ఆటిపాముల మహేందర్, కొంగరి దేవేందర్, వలందాసు భాను, మేకం పాండు, పొట్ట బత్తిని బాలయ్య, బాల నరసింహ, కుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.