నారద వర్తమాన సమాచారం
03-07-2024.
జులై 4 దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి.
*విద్యార్థి,యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ.
ఏ ఐ ఎస్ ఎఫ్ ,ఏ ఐ వై ఎఫ్
దేశంలో విద్యా రంగం పట్ల పరీక్షల నిర్వహణ పట్ల పేపర్ లీకేజీల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ “జులై 4న కెజి టూ పిజి దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్” ను విజయవంతం చేయాలని విద్యార్థి,యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చింది. బుధవారం మలక్ పెట్ లో బంద్ పోస్టర్ ను విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విడుదల చేసింది.
ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం. చైతన్య యాదవ్, ఏ ఐ వై ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ* మాట్లాడుతూ నీట్, యూజీసీ నెట్ పరీక్ష పేపర్ల లీకేజీ వలన నష్టపోయి ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు పూర్తిస్థాయి భరోసా కల్పించడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వామే బాధ్యత వహించాలని, పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, పేపర్ లీకేజీ వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్.టి.ఏ ను రద్దు చేయాలని, పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నీట్, యుజిసి నెట్ పేపర్ లీకేజీ కి ఘటనను నిరసిస్తూ జూలై 4న విద్యార్థి సంఘాలు ఇచ్చిన కేజీ టు పీజీ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావేత్తలు మేధావులు ,విద్యార్థులు విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నేతలు షేక్ మహమూద్, అనీల్ కుమార్, వంశి, రాహుల్, దశరథ్, అంజి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.