నారద వర్తమాన సమాచారం
కడప జిల్లా….
మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులను అత్యధిక ప్రాధాన్యతతో విచారణ వేగవంతం చేయాలి
రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలి..అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రిమాండ్ కు తరలించాలి
గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా
గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్థులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీముల ఏర్పాటు
నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్
కడప జులై 5: మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అత్యధిక ప్రాధాన్యత తో వాటిని విచారించి అదృశ్యమైన వారి జాడ తెలుసుకుని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాలని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పోలీస్ అధికారుల ను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక టీమ్ లు రాష్ట్ర, దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి విచారించాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.