నారద వర్తమాన సమాచారం
వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు
వీటిపై అవగాహన కోసం గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చన్నారు.
గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చన్న అంశాలపై సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించారు. చెట్ల నుంచి రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరవాత తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగ పడుతుందని.. ఈ విషయంలో స్థానిక సంస్థలు తగు చర్యలు చేపట్టాలన్నారు. రీ సైకిల్ కాని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించకుండా చూడాలని కోరారు. స్థానిక సంస్థలకు వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఒక సవాల్‌గా మారుతోందని.. శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.