కంటైనర్ ను ఢీ కొట్టిన కారు నలుగురు మృతి
ఏలూరు జిల్లా
:జులై 08
ఏలూరు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు.
ద్వారకా తిరుమల మండ లం లక్ష్మీనగర్ లో సోమవా రం ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కారు విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు అతివేగంతో వచ్చి ఢీకొ ట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించ గా.. ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.