నారద వర్తమాన సమాచారం
దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తలుపు తెరుచుకోనున్నాయి. దాదాపు 55 ఏళ్ల నుండి మూసిఉన్న మూడో గదిని ఈ నెల 14న రత్నభాండాగారాన్ని తెరవాలని రత్నభాండ పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్ జస్టిస్ వష్నాథ్ రథ్ మీడియాతో మాట్లాడుతూ.. జులై 14న రత్నభాండాగారాన్ని తెరిపించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.అలానే ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత కీలక పనులు ప్రారంభిస్తామని, రత్నభాండాగారం తెరవబడుతుందని పేర్కొన్నారు.
రత్నభాండాగారం అంటే ఏంటి..?
పూర్వం రాజలు జగన్నాథునికి విలువైన కానుకలను సమర్పించేవారు. వాటిని ఆలయ అధికారులు భద్రంగా దాచిన చోటునే రత్న భాండాగారం అని పిలుస్తున్నారు. కాగా పూరీ ఆలయం కింద భాగంలో ఉత్తర దిక్కులో ఈ రత్న భాండాగారం ఉంది. కాగా ఇది మూడు గదులుగా విభజింపబడి ఉంటుంది. కొన్ని నివేధికల ప్రకారం.. మొదటి గదిలో స్వామి వారి విలువైన వస్తువులు ఉన్నాయి.
ఇక రెండో గదిని బాహర్ బండార్ అని పిలుస్తారు. దీనిలో స్వామి వారి నిత్య పూజలకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. అలానే మూడవ గదిని బితర్ బండార్ అని పిలుస్తారు . ఇందులోనే గతంలో రాజలు స్వామి వారికి సమర్పించిన అంతులేని నిధి దాగి ఉంది. అయితే ఈ గది తాలాలు గతంలో కనిపించకుండా పోయాయి. మూడో గదిని తెరవాలంటే ఆ గది తాళాం చెవితోపాటు మిగిలిన రెండు గదుల తాళాంచెవులు ఉండాలి. అంటే మూడు తాళాంచెవులు ఉంటేనే తెరవగలం. ఈ నేపథ్యంలో
స్వామి వారి సంపధ భద్రంగానే ఉందా..? లేదా అనే అనుమానాలు భక్తుల్లో రేకెత్తుతున్నాయి.
వెల కట్టలేని అపార సంపద.. 1978లో చివరిసారిగా తెరుచుకున్న తలుపులు.
ఆలయంలోని నివేధికల ప్రకారం.. రత్నభాండాగారంలోని మూడో గదిని పలుమార్లు తెరిచారు. బ్రిటీష్ వాళ్లు భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో 1925లో ఒక సారి ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. ఈ నేపథ్యంలో అందులో ఉన్న సంపధను లెక్కించేందుకు యత్నించారు. అయితే అందులో ఉన్న సంపధ విలువను లెక్కకట్టలేకపోయారు. అలానే 1978లో మరోసారి రత్నభాండాగారాన్ని తెరిచారు.
దేశం నలుమూలల పేరుగాంచిన నిపుణులను పిలిపించి లెక్కించేందుకు యత్నించారు. అయితే వాటి విలువను ఆ నిపునులు సైతం చెప్పలేక పోయారు. స్వచ్చమైన బంగారం, వజ్రాలు, కెంపులు, పచ్చలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. 100 తులాల పైబడిన ఆభరణాలు ఉన్నాయి. కాగా వాటిలో కొంత భాగాన్నే లెక్కించగలిగారు. అనంతరం స్వామివారి నిధి నిక్షిప్తమై ఉన్న మూడో గది తాళాచెవి కనిపించకుండా పోయింది.ఈ నేపథ్యంలో స్వామి వారి సంపధ భద్రంగానే ఉందా..? అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. ఇక 1985లోనే ఈ రత్నభాండాగారాన్ని తెరిచారు. ఆ సమయంలో ఉన్న రెండు తాళాంచెవులతో మూడోగదిని తెరిచేందుకు యత్నంచారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.