నారద వర్తమాన సమాచారం
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఎమ్మార్వో కి వినతిపత్రం అందిస్తున్న మండల కిసాన్ మార్చ్ అధ్యక్షులు సురకంటి భూపాల్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సురకంటి భూపాల్ రెడ్డి విమర్శించారు.
పురపాలక కేంద్రంలో మంగళవారం బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా, రెండు లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు 15 వేల రూపాయలు పథకాలను వెంటనే అమలు చేయాలని నిరసిస్తూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ
ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులకు ఇచ్చిన హామీలు అమలు వచ్చేసరికి కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను గోసకు గురిచేస్తుందని వారు దుయ్యపట్టారు.
మేనిఫెస్టో ప్రకటించినట్టు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీని వెంటనే అమలు చేయాలని వారు అన్నారు. రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి రబీ ఖరీఫ్ సీజన్లకు అందించాల్సిన రైతు భరోసాను వెంటనే అందించాలని వారు అన్నారు. రైతులకు ఇస్తానన్న ఎకరాకు 15 వేల హామీలను కూడా వెంటనే అమలు చేసే దిశగా పని చేయాలని లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేర్బడి పట్టి రైతుల పక్షాన నిలబడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జిల్లా ప్రధాన కార్యదర్శి యన్నం శివకుమార్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సురకంటి రంగారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, మండల పట్టణ శాఖ అధ్యక్షులు గుండ్ల రాజు యాదవ్, డబ్బికార్ సాహెష్, మేకల చొక్కా రెడ్డి, ప్రధాన కార్యదర్శులు భైర వెంకటేష్ గౌడ్, గోలనకొండ ప్రభాకర్, నాయకులు దామోదర్ రెడ్డి, కేసారం కృష్ణారెడ్డి, బద్దం వెంకటరెడ్డి, బూత్ అధ్యక్షులు పాలకుర్ల నవీన్, వష్పరి రాజేష్, చంద్రకాంత్, నరేందర్, రామకృష్ణారెడ్డి, పవన్ రెడ్డి, ఇంద్ర వర్ధన్, సురేష్ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.