నారద వర్తమాన సమాచారం
వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి
వరదలు సమర్ధవంతంగా ఎదుర్కోటానికి ప్రణాళిక సిద్ధం చేయండి
ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చర్యలు
జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్.
పాడేరు, గోదావరి శభరి నదులకు రానున్న వరదల పట్ల అన్ని శాఖలు అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, వరదలకు సంబంధించి ఐదారు రోజుల ము౦దుగానే సమాచారం వస్తుందని ఐదు రోజులు ముందుగా అవసరమైన సామగ్రిని, మేన్ పవర్ ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు, బోట్లు, లాంచీలు, ట్రాక్టర్లు అవసరం, డీజిల్, కిరోసిన్, సోలార్ లైట్లు, తార్ఫాలిన్లు, దోమతెరలు, మందులు మొదలగు అవసరాలను ముందుగానే అంచనా వేసి సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరగకుండా వరదలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.