నారద వర్తమాన సమాచారం
విధాన నిర్ణయంలు-వినియోగదారుల బెంబేలు – డా!! చదలవాడ హరిబాబు. సిసిఐ జాతీయ ఉపాధ్యక్షులు
రాఫ్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా నిర్వహిస్తున్న రు.160 /- లకు కిలో కందిపప్పు, రు.48/-లకు సానామసూరి బిపిటి బియ్యం సబ్సిడీపై పేద ప్రజలకు అందించాలని ఏర్పాటు చేసిన కౌంటర్ అధికారుల అనాలోచిత నిర్ణయము వలన వెలవెలపోతుండటం చాలా బాధాకరమైన విషయము అని, పర్యవేక్షించాల్సిన అధికారులు ఎన్ టి ఆర్ రైతుబజారులో లోపల ఎక్కడో కౌంటరు ఏర్పాటు చేయడము వలన ఎక్కడ అమ్ముతున్నారో తెలియక తనిఖీకి వెళ్ళిన లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్, వినియోగదారుల సంఘాల నాయకులు డా!! చదలవాడ హరిబాబు, మునిపల్లె కవిత విస్మయానికి గురిఅయి, ఇలా అధికారులు నిర్లక్ష్యం చేయడము వలన ప్రభుత్వ పధకాలు పేద ప్రజలకు చేరకుండా నిరూపయోగం అవుతున్నాయని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి మరియు సంబంధిత మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్బంగా తెలియజేసారు. ఇప్పటికైన సంబంధిత అధికారుల కౌంటర్లను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజారులో ముందు భాగంలో కౌంటర్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.