నారద వర్తమాన సమాచారం
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు కేంద్ర సర్కార్ షాక్
న్యూ ఢిల్లీ :
అధికారం దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై కేంద్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుం ది. ఆమె శిక్షణను నిలిపి వేసి, వెనక్కు పిలిచింది.
ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) నుంచి ఉత్తర్వులు వెలువ డ్డాయి. ఈనెల 23లోగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రే షన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
తదుపరి అవసరమైన చర్య కోసం ఆమెను అకాడమీకి పిలిచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.మహారాష్ట్ర ప్రభు త్వ జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా రిలీవ్ అయ్యారు.
జూలై 23లోపు వీలైనంత త్వరగా అకాడెమీలో చేరాలని పూజా ఖేద్కర్‌ను జీఏడీ ఆదేశించింది. ఆమెపై పలురకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభు త్వం ఈ మేరకు చర్య తీసుకుంది.
అధికారం దుర్వినియోగం చేశారని, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు.2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్.. ప్రొబేషన్‌లో భాగంగా పుణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఈ ఏడాది నియమితుల య్యారు.
అయితే జూన్ 3న విధుల్లో చేరడానికి ముందే అధికార దుర్వినియోగానికి పాల్పడ టంతో వాషిమ్‌కు బదిలీ చేశారు. సివిల్ సర్వీసెస్‌లోకి రావడానికి యూపీఎస్సీకి నకిలీ డిజబిలిటీ సర్టిఫికెట్ సమర్పించినట్టు ఆరోప ణలు వచ్చాయి.
ఓబీసీ సర్టిఫికెట్ తారు మారు చేసి ఎంబీబీఎస్ చదివినట్టు కూడా తాజాగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె తల్లి కూడా వివాదం తో చిక్కుకోవడంతో పూజ తీవ్ర విమర్శలపాలయ్యారు.
కాగా, తనపై వచ్చిన ఆరో పణలపై మీడియా ట్రయల్ నడుస్తోందని పూజా ఖేద్కర్‌పై ఇంతకుముందు వ్యాఖ్యానించారు. తనను దోషిగా నిలబెట్టేందుకు మీడియా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
ఆరోపణలు రుజువయ్యే వరకు తాను నిరపరాధి నేనని చెప్పుకొచ్చారు. అయితే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆమె కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.