న
ారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
నరసరావుపేట లోని నరసరావుపేట1టౌన్,2టౌన్, నరసరావుపేట రూరల్,ట్రాఫిక్ మరియు సిసిఎస్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ .,
పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాది దారులకు వెయిట్ రూమ్ వుండాలని, పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోస్ చెయ్యాలనీ సూచించారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి. డ్రంకన్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలి.
హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సి ఆర్. పి. సి , తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్ట్ కాని కేసులలో నిందితులను త్వరగా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా స్టేషన్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్య మైన కేసులు మరియు పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు.
పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నిర్దేశిత కాల వ్యవధిలో కోర్ట్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, సమర్థవంతమైన ట్రయిల్ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చెయ్యాలని సూచించారు.
అదే విధంగా పోలీసు స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద , హోటల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకై కృషి చేయాలని దానికి గాను ప్రత్యేక టీమ్స్ పెట్టి గంజాయి అమ్ముతున్న తాగుతున్న వారి నిఘా పెట్టీ అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే విధంగా రాత్రి మరియు పగలు బీట్ల పని తీరును నిరంతర మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు.
అదే విధంగా రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.