నారద వర్తమాన సమాచారం
హైవే భూ నిర్వాసితులకు పరిహారం బదులు భూమి ఇవ్వాల
సమావేశంలో మాట్లాడుతున్న డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
గౌరెల్లి టు భద్రాచలం హైవే పనుల్లో భూమి కోల్పోతున్న పోచంపల్లి మండల రైతులకు పరిహారం బదులు ప్రభుత్వ భూమిని పట్టా రూపంలో అందించాలని డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు కళ్ళం రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.
పురపాలక కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లాయిపల్లి పక్కన ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం రేటు ప్రకారం ఎకరానికి 40 లక్షలు ఉంటే దానికి ప్రభుత్వం మూడింతలు అందిస్తున్న నేపథ్యంలో పోచంపల్లి మండలంలో మాత్రం కేవలం 8 లక్షల రూపాయల కేటాయించడం సబబు కాదని ఆయన అన్నారు.
మండలంలో ఉన్నది సన్న కారురైతులు కావడం వల్ల వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఈ డబ్బులతో భూమి కొనుక్కోలేని స్థితిలో ఉంటారని దీనికి బదులు మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిహారం బదులు రైతులకు అందించాలని ఆయన అన్నారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయటం హర్షణీయమని ఆయన అన్నారు కాగా మండలంలో కొంతమంది లక్షలోపు రుణాలు ఉన్న రైతుల సాంకేతిక కారణాల వల్ల కొంతమంది పేర్లు రాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి ఇబ్బందులను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు దగ్గరుండి అధికారుల దగ్గరికి వెళ్లి రైతులకు సహకరించాలని ఆయన కోరారు. వీరితోపాటు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్ నాయకులు ఎట్ట మోని మహేష్ యాదవ్, జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.