నారద వర్తమాన సమాచారం
చిరు వ్యాపారుల పై మున్సిపల్ కమీషనర్ దాస్టికాన్ని ప్రదర్శించడం హేయమైన చర్య – సి.పి.ఐ
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో
బ్రహ్మానంద రెడ్డి కాంప్లెక్స్ లో కూరగాయలు అమ్ముకుంటున్న పేదల పైన మున్సిపల్ కమిషనర్ జులుం ప్రదర్శించటాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. కాంప్లెక్స్ ఆక్రమించుకున్న పెద్దల జోలికి పోకుండా చిరు వ్యాపారుల పైన దాస్టికాన్ని ప్రదర్శించడం హేయమైన చర్య అని, సొంతంగా షాపులు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్న పెద్దపెద్ద వాళ్లని ఏమనకుండా చిన్నచిన్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవడం ఏమాత్రం భావ్యం కాదు అని, కాంప్లెక్స్ మొత్తం ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకుంటున్న పట్టించుకునే నాధుడే లేడని,
23 షాపులు ఖాళీగా ఉన్న, ఆ షాపులలో ఇష్టానుసారంగా మద్యం గంజాయి, గుట్కాలు, పాన్ పరాకులు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ చిరు వ్యాపారులపై జులుం ప్రదర్శించటం సరైనా చర్య కాదని, కోర్టులో ఉన్న 23 పాపులను గెలుచుకున్న వారికి న్యాయ ప్రకారం బాధితులకు ఇవ్వని కమిషనర్ హఠాత్తుగా షాపులు పడగొట్టారు అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా బ్రహ్మానంద రెడ్డి కాంప్లెక్స్ ను ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారుల పైన చర్యలు తీసుకోవాలని, నిరుపేదలైన కూరగాయలు అమ్ముకొని జీవిస్తున్న చిరు వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేయటం ఏ మాత్రం భావ్యం కాదని ఆయన అన్నారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని లేని పక్షాన సిపిఐ ఆథ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, సిపిఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య బాధితులు రామిశెట్టి శంకరు, అనిల్, చింత శ్రీనివాసరావు, సుబ్బారావు, సాంబయ్య, శివ కోటేశ్వరరావు, సుబ్బయ్య, అన్నమయ్య, జేవియర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.