నారద వర్తమాన సమాచారం
సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న లక్కబత్తిని రవి…
ఆపరేషన్ నిమిత్తమై మహిళకు ఏ పాజిటివ్ రక్తం అందజేత…
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…
కామారెడ్డి జిల్లా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న తస్లీమా బేగం (72) కి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవి నీ సంప్రదించడంతో వెంటనే స్పందించి కామారెడ్డికి వచ్చి రక్తాన్ని అందజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది అని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేయడమే కాకుండా,డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి కావాల్సిన ప్లేట్ లెట్స్ ని కూడా అందజేస్తూ ఆదర్శంగా నిలవడం జరుగుతుందన్నారు.రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని దానికి నిదర్శనమే రవి చేస్తున్న రక్తదాన కార్యక్రమాలు అన్నారు కుటుంబ సభ్యులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం చేయాలనుకున్న వారు వారికి సంబంధించిన వివరాలను 9492874006 నెంబర్ కి తెలియజేయాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేస్తూ ముందుకు వస్తూ ప్రాణాలను కాపాడుతున్న రవి కి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు జీవన్,వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.