నారద వర్తమాన సమాచారం
సీనియర్ జర్నలిస్ట్ ఎన్ వెంకటేశ్వరరెడ్డి అస్తమయం
విలువలతో కూడిన జర్నలిజం వృత్తిని కొనసాగించిన ఎన్ వి ఆర్
నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, జర్నలిస్టులు
ఎల్బీనగర్
సమాజ పరిరక్షణకు జర్నలిజం ఒక మూల స్తంభం. జర్నలిజం వృత్తిలోని ప్రతివ్యక్తి అత్యున్నతమైనటువంటి విలువలు ఆశయాలతో తన అక్షరకలాన్ని ముందుకు సాగిస్తే సమ సమాజ స్థాపన ఎల్లప్పుడూ జరుగుతుందనేది తన చివరి తుది శ్వాస వరకు నిరంతరం కృషి చేసిన జర్నలిజం యోధుడు. నిడంబరంగా జీవనాన్ని కొనసాగించిన ఆయన చివరి తుదిశ్వాస వరకు ప్రయాణం కొనసాగించిన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ వెంకటేశ్వరరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని కూతురు చూడడానికి వెళ్ళిన వెంకటేశ్వరరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం ఫేస్-4కాలనీలోని అనే నివాసానికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వర్ రెడ్డికి దంపతులకు ముగ్గురు కూతుర్లు సంతానం. దాదాపు 25 ఏళ్లకు పైగా జర్నలిజం వృత్తుల కొనసాగిన ఎన్ వి ఆర్ నాస్తికుడుగా అందరికీ సుపరిచితం. ఎంతో ఉత్తమమైనటువంటి విలువలను చిన్నతనం అందిపుచ్చుకొని తనకున్నటువంటి ఆస్తిపాస్తులు సైతం దానం చేసిన యోధుడు. 1990కి పూర్వం నుండి జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ అప్పటి విజేత తెలుగు దినపత్రికకు మేనేజర్ గా సుదీర్ఘకాలం విధులు నిర్వహించారు. తన కలం నుండి జాలువారే ప్రతి అక్షరాన్ని సైతం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా జర్నలిజం వృత్తిని కొనసాగించిన అతికి తక్కువ మందిలో వెంకటేశ్వరరెడ్డి ప్రథమ వరసలో ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వెంకటేశ్వర్ రెడ్డితో సత్సబంధాలు కొనసాగించారంటే ఆయన విలువలతో కూడిన జర్నలిజమే అందుకు నిదర్శనం. విజేత తెలుగు దినపత్రిక అనంతరం అప్పటి ప్రజాశక్తి తెలుగు దినపత్రికలో వనస్థలిపురం విలేకరిగా ఆయన సుదీర్ఘకాలం విధులు నిర్వహించారు. జర్నలిజం వృత్తిని కొనసాగిస్తూనే ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో జాగ్రత్త పాటించే ఎన్ వి ఆర్ అనేక అంశాలపై ఏకధాటిగా విశ్లేషణ చేసే గొప్ప వక్త. ఆధ్యాత్మిక, నాస్తిక, ఇతరత్రా అనేక అంశాలపై ఎన్నో సభలు సమావేశాల్లో పాల్గొని సుదీర్ఘంగా తన గళాన్ని చాటిన యోధుడు. తన స్వస్థలమైనటువంటి కర్నూలు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వం పశువైద్యశాలను సైతం తీసుకురావడంలో ఆయన కృషిని మరువలేదని బంధువులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఒకానొక దశలో ప్రముఖ జీవవైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ సహకారంతో తెలుగు మంత్లీ మ్యాగజిన్ సైతం అందుబాటులోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. అయినప్పటికీ ఎన్ వి రెడ్డి డాక్టర్ మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోని ఆరోగ్య పరిరక్షణ అంశాలపై ఎన్ వి రెడ్డి ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుపరిచిత వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ఎన్ వి రెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం మంగళవారం సాయంత్రం సాహెబ్ నగర్ స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఎన్ వెంకటేశ్వరరెడ్డి అంత్యక్రియలు ముగిశాయని సన్నిహితులు వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.