నారద వర్తమాన సమాచారం
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్.,
విచారణలో ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి
స్టేషన్ లకు వచ్చే ఫిర్యాదుదారి పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలి
ఎన్ఫోర్స్మెంట్ పెంచి చట్ట వ్యతిరేక/అసాంఘీక కార్యక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలి
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి
దర్శి సబ్ డివిజన్, దర్శి సర్కిల్ పరిధిలోని తాళ్ళూరు, ముండ్లమూరు, దర్శి పోలీస్ స్టేషన్ లను మరియు ఒంగోలు సబ్ పరిధిలోని చీమకుర్తి పోలీస్ స్టేషన్ లను గురువారం జిల్లా ఎస్పీ గారు సందర్శించి పోలీసు స్టేషన్ లోని లాకప్, రిసెప్షన్, కంప్యూటర్ రూమ్, జి.డి మరియు రికార్డుల నిర్వహణ, పోలీసు స్టేషన్ పరిసరాలను, వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలన్నిటిని పరిశీలించారు. పని చేయుచున్న సిబ్బంది వివరాలు, వారి విధి నిర్వహణ పని తీరు గురించి ఆరాతీశారు. ప్రతి స్టేషన్ ఆవరణను పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్ లలో పెండింగ్ ఫైల్స్ ను తనిఖీ నిర్వహించి పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని, స్టేషన్ రికార్డ్స్ అన్ని సక్రమంగా నిర్వహించాలన్నారు. మహిళలు,పిల్లలు భద్రత విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, అలాగే నేరాలను అరికట్టేందుకు గస్తి ముమ్మురం చేయాలని, అసాంఘిక చర్యలపై అడ్డుకట్ట వెయ్యాలన్నారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు.
శాంతిభధ్రతల పరిరక్షణకు విజబుల్ పోలీసింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు, పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.
గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో బీట్లు తిరిగే సమయంలో చెడునడత/హిస్టరీ షీట్లు కలిగిన వారిని చెక్ చేయాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. సిబ్బందికి కేటాయించిన గ్రామాలలో విధిగా పర్యటించాలని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని,ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రజలకు సీసీ కెమెరాల పై అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, అలాగే సైబర్ నేరాల పట్ల, సైబర్ నేరగాలు చూపే మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని తెలిపారు.
పోలీస్ సిబ్బంది యూనిఫామ్ నీట్ టర్న్ అవుట్ కలిగి ఉండాలని, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, సిబ్బందికి ఏమన్నా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు సిబ్బందికి రోల్ కాల్స్ నిర్వహించాలని తెలిపారు. స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ వెంట తాళ్ళూరు ఎస్సై విజయకుమార్, దర్శి ఎస్సై సుమన్, చీమకుర్తి ఎస్సై వెంకట కృష్ణయ్య, చీమకుర్తి పిఎస్సై రాజమోహన్ రావు మరియు సిబ్బంది ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.