కక్షలు వద్దు కుటుంబమే ముద్దు
రాజుపాలెం మండలం పెదనెమలిపూరి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్నిసత్తెనపల్లి డిఎస్పి గురునాథ బాబు ఆధ్వర్యంలో రాజుపాలెం ఎస్ఐ సమీర్ బషా సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సీఐ యం. రాంబాబు నిర్వహించడం జరిగింది.
గ్రామం లో ఎలక్షన్ టైం లో చెలరేగిన గొడవల పైన శాంతి కమిటీ ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టి కక్షలు వద్దు కుటుంబమే ముద్దు, ఎన్నికలు వస్తాయి పోతాయి గ్రామంలో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉండాలని గొడవలు కి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉందని ఎవరు దాన్ని విస్మరించొద్దని అల్లర్లకు పాల్పడవద్దని కేసులో ఇరుక్కోని జైలు పాలవద్దని గ్రామంలో ఉన్న అశాంతిని పారద్రోలి శాంతియుతంగా అందరూ ఉండాలని సత్తెనపలి డీఎస్పీ జి.గురునాథ్ బాబు గ్రామ ప్రజలకు మంచి చెప్పారు.
అనంతరం అనుమానితుల ఇళ్లల్లో సోదాలు కూడా నిర్వహించామని, గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సీఐ రాంబాబు మీడియా మిత్రులకు వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.