నారద వర్తమాన సమాచారం
ఇసుక స్టాక్ యాడ్ నందు అక్రమాలు బట్టబయలు చేసిన ఎస్ ఈ బీ ఇన్ స్పెక్టర్ మణికంఠ రెడ్డి
జాగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం ఇసుక స్టాక్ యాడ్ నందు
ప్రభుత్వం ఆదేశించిన నియమ నిబంధనలు ప్రకారం
సాధారణంగా ఇసుక కావలసిన వినియోగదారులు స్టాక్ యార్డ్ వద్దకు వచ్చి అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన స్వైపింగ్ మిషన్ లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఆన్లైన్లో ప్రభుత్వoనకు నగదును చెల్లించి ఇసుకను పొందవలసి ఉంటుంది.
కానీ ప్రైవేటు వ్యక్తి ఇసుక వినియోగదారుల నుంచి ఫోన్ పే ద్వారా తన వ్యక్తిగత అకౌంట్ కి సొమ్ములను స్వీకరించి, తరువాత వాటిని ప్రభుత్వ ఖాతాకు చెల్లించి రసీదు ఇచ్చు క్రమంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ.
స్వైపింగ్ మిషన్ ద్వారా రసీదు తీసే క్రమంలో ఒకే ట్రాన్సాక్షన్ కు సంబంధించి మర్చంట్ రసీదు, కార్డు హోల్డర్ రసీదు అనే రెండు రసీదులను జనరేట్ చేసి తన ప్రైవేట్ ఖాతాకు సొమ్ములు చెల్లించిన వారికి విడివిడిగా రసీదులు ఇవ్వకుండా
ఒక వ్యక్తికి సంబంధించిన రసీదు యొక్క రెండవ కాపీని రెండో వ్యక్తికి ఇస్తున్నాడని గుర్తింపు.
ఒక వ్యక్తి చెల్లించిన నగదు ప్రభుత్వ ఖాతా కు జమ చేయలేదని నిర్ధారణ.
గురువారం ఉదయం నుండి ఆ వ్యక్తి 25 ,350 రూపాయలను ఇసుక వినియోగదారుల నుండి వ్యక్తిగత ఖాతాకు ఫోన్ పే ద్వారా పొందడం జరిగింది.
కానీ తిరిగి ప్రభుత్వ ఖాతాకు చెల్లించే క్రమంలో 21,750 రూపాయల మాత్రమే చెల్లించాడు
జగ్గయ్యపేటకు చెందిన పవన్ నుండి 15 ,000 రూ వ్యక్తిగత ఖాతాకు పొందడమే కాకుండా, అతనికి నిన్న ఒక్క రోజునే 50 టన్నుల ఇసుకను మంజూరు చేసే విధంగా ట్రాన్సాక్షన్ చేయటం జరిగింది.
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నుల కు మాత్రమే మంజూరు.
కానీ ఇతను 50 టన్నుల ఇసుకను పవన్ కి మంజూరు చేయటానికి ప్రయత్నించాడు.
ఈ నేపథ్యంలో ఇతనితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్క ట్రాక్టర్ కు 5 టన్నుల చొప్పున ఇసుకను లోడ్ చేయించుకుని స్టాక్ యాడ్ నందు ఎగ్జిట్ పాయింట్ వద్దకు రావడం జరిగింది .
ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సీబీ సిబ్బంది సరైన పత్రాలు మరియు నగదు రసీదును లేకుండా ట్రాక్టర్ లో ఇసుకను లోడ్ చేయించుకోవటం, ఎగ్జిట్ పాయింట్ వరకు రావడం
చట్టప్రకారం నేరంగా గుర్తించి సదరు రెండు ట్రాక్టర్ల డ్రైవర్లను అదుపులో తీసుకొని, రెండు ట్రాక్టర్లు,అందులోని పది టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇసుక స్టాక్ పాయింట్ లో అనధికారికంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్న షేక్ సైదా ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతనికి సంబంధించిన వివో స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకోవటం జరిగింది.
అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను మరియు రెండు ట్రాక్టర్లను అందులో రవాణా చేస్తున్న తదితరులు ఇసుక ,స్మార్ట్ ఫోన్ ను తదుపరి చర్యలు నిమిత్తం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు వశపరచడం జరిగింది అని ఎస్.ఈ.బి ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి తెలియ జేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.