నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు కల్పించాలి: ప్రగతిశీల యువజన సంఘం పట్టణ కార్యదర్శి పగడాల శివ
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. వైద్యానికి పేద ప్రజలు తమ సంపాదనంతా వైద్యానికి ఖర్చు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందివ్వాలని ప్రగతిశీల యువజన సంఘం పోచంపల్లి పట్టణ కార్యదర్శి పగడాల శివ అన్నారు.
పోచంపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్ సదుపాయాలపై పి.వై.ఎల్. ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ప్రజలకు అత్యవసరమైన వైద్యం, విద్యను ఉచితంగా అందివ్వాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారైందని, సరైన సౌకర్యాలు 24గంటలు డాక్టర్లు అందుబాటులో లేక ఎమర్జెన్సీ కేసులు వస్తే హైదరాబాద్ కి పంపుతున్నారని, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లాభాల కోసం ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ ని పట్టిచుకోవడం లేదనీ, బడ్జెట్లో ప్రజారోగ్యం గురించి ఊసే లేదనీ, అంబులెన్స్, అన్ని రకాల టెస్టులు అందుబాటులోకి తేవాలని, డాక్టర్స్ స్థానికంగా ఉండాలని, అడ్మిట్ అయిన రోగులకు 3పూటలా భోజన ఏర్పాట్లు చేయాలనీ, అదే విదంగా స్వీపింగ్ ఉద్యోగులకు సమయానికి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటూ పేద కార్మికులకు టైం ఇవ్వకుండా వేధిస్తున్నారని, కార్మికులకు 1వ తారీకున కచ్చితంగా జీతాలు వేయాలని, హాస్పిటల్స్ సమస్యలు అన్నిటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.నరసింహ, కె.సత్తయ్య, యాదయ్య, బాలు , మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.