నారద వర్తమాన సమాచారం
తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ
తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ప్రస్తుతం తెలంగాణకు ఇన్‌చార్జ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీపీ రాధాకృష్ణన్
ఆయనను మహారాష్ట్రకు గవర్నర్‌గా పంపిన ప్రభుత్వం
తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గత రాత్రి ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తూ తెలంగాణకు ఇన్‌చార్జ్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రకు గవర్నర్‌గా పంపారు.
జిష్ణుదేవ్ త్రిపుర బీజేపీ సీనియర్ నాయకుడు. 2018 ఎన్నికల్లో చారిలమ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన బిప్లబ్‌కుమార్‌దేబ్, మాణిక్‌సాహా ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అధిష్ఠానానికి వీర విధేయుడైన జిష్ణుదేవ్‌ను ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా నియమించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.