నారద వర్తమాన సమాచారం
మా గొంతులు ఎండిపోతున్నాయి…! గుక్కెడు నీళ్లు ఇవ్వండి. ప్లీజ్ కలెక్టర్ అమ్మగారు
మా బాధను ఎవరికి చెప్పినా స్పందించని అధికారులు. అందుబాటులో లేని గ్రామ సర్పంచి.
200 కుటుంబాలకు ఒకే ఒక్క బోరు (నీళ్లు రాని )వైనం
*మాకు మీరే దిక్కమ్మా కలెక్టర్ అమ్మగారు…
గుక్కెడు నీళ్ల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న గుర్రపుశాల ఎస్సీ కాలనీ మహిళలు….
ఎర్రగొండపాలెం:
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని గుర్రపుశాల పంచాయతీలో ఎస్సీ కాలనీ తాగునీటి కోసం పొలాల బయటికి వెళ్తున్న మహిళలు పిల్లలు వృద్దులు ఆ గుక్కెడు నీళ్ల కోసం కూలి పని వదిలేసి తాగునీటి కోసం పరుగులు తీస్తున్న గుర్రపుశాల ప్రజలు. ఎస్సీ కాలనీ లో ఒక్క బోరు ఉన్న అవి భూగర్భ జలాలు అడుగంటిపోయి పూర్తిగా నీళ్లు రావడమే ఆగిపోయినవి. గ్రామం మధ్యలో చర్చి దగ్గర ఉన్న ఆ బోరు లో నుండి సన్నగా గంటకు రెండు బిందువులు మాత్రమే వస్తాయి అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తాగునీటి కోసమే గ్రామంలో గొడవలు కూడా జరుగుతున్నాయని మహిళలు అన్నారు. పంచాయతీకి సంబంధించిన వారు ట్యాంకర్లు కూడా నీళ్లు తోలటం లేదు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఎందుకు తోలటం లేదో ఇప్పటికీ మాకు అర్థం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ డిపార్ట్మెంట్ చెందిన అసిస్టెంట్ ఏఈ శ్రీకాంత్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గ్రామం వైపు కూడా చూడలేని స్థితిలో, స్పందించలేని స్థితిలో మాటలకు మాత్రమే పరిమితమై ఎస్సీ కాలనీ లో ఉన్న సమస్యను గాలికి వదిలేశాడు. ఇప్పటికైనా స్పందిస్తాడో లేదో సమస్యను పరిష్కరిస్తాడు లేదా గాలికి వదిలేస్తాడు వేచి చూడాలి. గ్రామంలో ఉన్న సర్పంచ్ *వాడాల పద్మ* కు ఎస్సీ కాలనీలో నీటి సమస్యను తన దృష్టికి తీసుకువెళ్లిన ఇప్పటివరకు కూడా స్పందన కరువైంది. గుర్రపుశాల ఎస్సీ పాలెం లో కూడా నీటి కోసం గంటలు తరబడి ఎదురుచూస్తున్న ఎస్సీ పాలెం ప్రజలు ఏదేమైనా మా పంచాయతీలో ప్రధానమైన నీటి సమస్యను తీర్చాలని ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు చెప్పిన పట్టించుకునే నాధుడు లేడు పై అధికారులు స్పందించి వెంటనే మాకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని గ్రామంలోని ప్రజలు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.