Friday, November 22, 2024

పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట టౌన్, చిలకలూరి పేట రూరల్,నాదెండ్ల,యడ్లపాడు పోలీస్ స్టేషన్లను విజిట్ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ  కంచి శ్రీనివాసరావు ఐపీఎస్

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట టౌన్, చిలకలూరి పేట రూరల్,నాదెండ్ల,యడ్లపాడు పోలీస్ స్టేషన్లను విజిట్ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్

పోలీసు స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాది దారులకు వెయిటింగ్ రూమ్ వుండాలని, పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోస్ చెయ్యాలనీ సూచించారు.
చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలనీ,డ్రంకన్ డ్రైవ్ లు నిర్వహించాలని మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలనీ సూచించారు.
హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C, తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్ట్ కాని కేసులలో నిందితులను త్వరగా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ సమయంలో నమోదైన కేసులను సమీక్షించి వాటిలో అరెస్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
అదే విధంగా పోలీసు స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హాస్టల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకై కృషి చేయాలని దానికి గాను ప్రత్యేక టీమ్స్ పెట్టి గంజాయి అమ్ముతున్న, తాగుతున్న వారిపై నిఘా పెట్టీ అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే విధంగా రాత్రి మరియు పగలు బీట్ల పని తీరును నిరంతర మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు.
అదే విధంగా రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీట్స్ కలిగినవారి కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

చిలకలూరిపేట పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ టిట్కో గృహా సముదాయాలను సందర్శించిన ఎస్పీ

టిట్కో గృహా సముదాయలలో ఉన్న ప్రజలతో

ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, అక్కడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి భద్రత కొరకు అలాగే అక్కడ ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలపాలు జరగకుండా ఉండుటకు ఒక పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసామని మీకు ఏమైనా సమస్యలు వుంటే ఔట్ పోస్ట్ లోని పోలీస్ వారికి తెలిచేయాలని చెప్పగా అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading