Thursday, November 21, 2024

కష్టాలు చెప్పుకునేందుకు నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు తరలివస్తున్న ప్రజలు

నారద వర్తమాన సమాచారం

కష్టాలు చెప్పుకునేందుకు నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు తరలివస్తున్న ప్రజలు

బాధితుల కన్నీళ్లు తుడుస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తున్న యువనేత

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని బాధితుల ఆవేదన

20వ రోజు ప్రజాదర్బార్ కు భారీగా తరలిరాక

అమరావతి సమస్యలు పరిష్కారం కాక వైసీపీ ఐదేళ్ల పాలనలో కష్టాలు, కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన బాధితులకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” భరోసా ఇస్తోంది. ప్రజల విన్నపాల పట్ల తక్షణమే స్పందిస్తున్న యువనేత.. పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని.. ప్రతిఒక్కరికి అండగా ఉంటామంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రజల వినతులపై వారానికోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే మంత్రి వెల్లడించారు. దీంతో తమ సమస్యలను, కష్టాలను విన్నవించేందుకు “ప్రజాదర్బార్” కు వేలాదిగా తరలివస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. 20వ రోజు “ప్రజాదర్బార్” కార్యక్రమానికి వేకువజాము నుంచే బారులు తీరారు. ప్రతి ఒక్కరిని నేరుగా కలిసిన మంత్రి.. వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

• మంగళగిరి నియోజకవర్గం పెద్ద కొండూరుకు చెందిన పి.మాచమ్మ యువనేతను కలిసి తమ సమస్యను విన్నవించారు. గ్రామంలో తనకున్న 60 సెంట్ల భూమి ప్రభుత్వ భూమిగా నమోదైందని తెలిపారు. అడంగల్ లో రికార్డు సవరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
• ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మార్కెట్ యార్డులో స్వీపర్ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని జి.వీరమ్మ కోరారు. ఆమె విజ్ఞప్తిని పరిశీలించిన యువనేత.. తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
• మంగళగిరి నియోజకవర్గం శృంగారపురానికి చెందిన మొవ్వా చంద్రశేఖర్ రావు, పొట్లూరి గౌతమ్, కావూరి నరసింహారావు నారా లోకేష్ ను కలిశారు. విశాఖ మధురవాడలో నేషనల్ హైవే-5, బీచ్ రోడ్డు విస్తరణలో తమ భూములు కోల్పోయామని, తగిన నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
• నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురానికి చెందిన ఇరుగుదిండ్ల నాగమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గ్రామంలో దశాబ్దాలుగా తన భర్త పేరుపై ఉన్న 5.73 ఎకరాల డి-పట్టా భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు దస్తావేజులతో నకిలీ పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు సృష్టించారని తెలిపారు. కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. సదరు ఫిర్యాదుపై స్పందించిన మంత్రి.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
• కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన వడ్డే తిరుపాలు మంత్రి లోకేష్ ను కలిశారు. 2014-19 మధ్య గ్రామంలో అంగన్ వాడీ పాఠశాల భవనం, సీసీ రోడ్డు, ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లు నిర్మించానని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో బిల్లులు మంజూరుకాక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రజాప్రభుత్వంలో బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
• ఆర్టీసీలోని విజిలెన్స్, సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తమకు 11వ వేతన సవరణ ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీఎస్ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కానిస్టేబుళ్ల వేతనం తగ్గిందని యువనేత దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
• ఏపీ సీఆర్ డీఏలో పనిచేస్తున్న డ్రైవర్లు, అటెండర్లను వీజీటీఎం ఉడా కేడర్ లో ఉన్న రెగ్యులర్ పోస్టుల్లో నియమించాలని సిబ్బంది యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
• రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు, హిందీ భాషోపాధ్యాయుల పదోన్నతులు, సర్వీసును కాపాడాలని సిబ్బంది మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
• విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన వి.హేమలత నారా లోకేష్ ను కలిశారు. తమ 17 ఏళ్ల కుమారుడు రెండు నెలలుగా అదృశ్యమయ్యాడని, ఎంత వెతకినా జాడ కనిపించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. కుమారుడు అదృశ్యంపై రాజాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. తమ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన యువనేత పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
• ఎలాంటి ఆధారం లేని తమ కుటుంబానికి ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ గొల్లపూడికి చెందిన మండవ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
• హెచ్ఐవీ, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న తమకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన పరసా వెంకటలక్ష్మీ దంపతులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

*****


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading