నారద వర్తమాన సమాచారం
తల్లి ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా
వైద్యాధికారి మహమ్మద్ షాద్
తల్లి ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా అని బిడ్డ జన్మించిన గంటలోపు తల్లిపాలు త్రాగించాలని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీహెచ్సీ వైద్యాధికారి మహమ్మద్ షాద్ అన్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటవ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రారంభం సందర్భంగా బుధవారం తల్లిపాల ఆవశ్యకతపై క్రోసూరులో ప్రదర్శన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య అధికారి మాట్లాడుతూ జన్మించిన మొదటి గంటలోనే కేవలం తల్లిపాలు బిడ్డకు జీవ రక్షక బిందువులని బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లి యొక్క పసుపు రంగులోని చిక్కటి పాలు (ముర్రు పాలు) అమృతం లాంటివని వీటి ద్వారా బిడ్డకు అతిముఖ్యమైన పోషకాలు లభిస్తాయని మురుపాలు బిడ్డను అనేక రోగాల నుండి సురక్షితంగా ఉంచుతుందన్నారు నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి మరియు సంపూర్ణ పోషణ లభించడమే కాక తల్లికి రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఆయన అన్నారు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అందుకోసం పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ప్రచారాన్ని చేపట్టాలని వైద్య అధికారి సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ బిడ్డ యొక్క సంపూర్ణ మానసిక వికాసం పుట్టిన మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలతోనే సాధ్యమని తల్లిపాలు బిడ్డ శరీరానికే కాక, తన మెదడుకు కూడా పోషణను ఇస్తుందని ఇంకా చురుగ్గా చేస్తుందన్నారు నవజాత శిశువు యొక్క మొదట ఆహారమైన తల్లిపాలలో ఉన్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలల్లో గేదె, మరియు డబ్బా పాలల్లో ఉండవన్నారు తల్లిపాలకు ఎటువంటి ప్రత్యామ్నయం లేదని ప్రతి బిడ్డకు తల్లిపాలు అందేలా చేయటమే మన సంకల్పం అని, రండి మన మందరం కలిసి ప్రతి బిడ్డకు తల్లిపాలు అందేలా ప్రతిజ్ఞ చేసి తల్లులు కాబోతున్న వారికి సహకరిద్దామని ఈ సందర్భంగా శాంసన్ అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, స్టాఫ్ నర్స్ రాణీ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.