ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కామారెడ్డి పోలీస్ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులకీ అవగాహన
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లో మానవ అక్రమ రవాణా,షీ టీం చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్ మరియు సైబర్ క్రైమ్ ఫై కళాబృందం మరియు ఏ హెచ్ టి యుఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థినిలకు షీటీం గురించి, సైబర్ నేరాల గురించి మూడ నమ్మకాలు గురించి, రోడ్డు భద్రత గురించి, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా నిర్మూలన మరియు డ్రగ్స్, మత్తు పదార్థాలు గురించి అవగాహన కల్పించనైనది. షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1 9 3 0 కు కాల్ చేసి వినియోగించుకోవలని చెబుతూ, అత్యవసర పరిస్థితుల టోల్ ఫ్రీ నంబర్స్ 100, 108, 1930, 181 ల విలువలు తెలుపనైనది. ఇట్టి కార్యక్రమానికి కళాబృందం సభ్యులు ప్రభాకర్ సాయిలు, యాంటీ వుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్ ఆఫీసర్ రాజేందర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ శిరీష మేడం ,సాధన సమితి సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా యాంటీ హ్యుమినిటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా పై ప్రతి విద్యార్థినికి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.