మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం దేశ్ముఖి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ సర్కార్ చేయని రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయన అన్నారు. గతంలో లక్ష రూపాయలు లోపు ఉన్న వారికి అకౌంట్లో డబ్బులు రాగా నేడు లక్షన్నరలోపు రుణమున్న వారందరికీ మరోసారి డబ్బులు బ్యాంకుల్లో వేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ఖాయమని ఆయన తెలిపారు. ఇదే నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి సత్తా చాటాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు జక్కుల శంకర్ యాదవ్, నాయకులు టింకుల్ కర వెంకటేష్, తోట బాబు, ఇరుగు మహిపాల్, దుద్యాల బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.