నారద వర్తమాన సమాచారంశేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపండి, మీ సేవలు చిరస్మరణీయం..పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ,ఐపీఎస్.,ఈ నెల పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ మరియు అధికారులు.సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి విరమణ పొందడం అభినందనీయం.కేవలం కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా విధులు నిర్వహించారు.పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం,శక్తి అన్నీ వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు.ఎటువంటి అవసరమైన సంప్రదించండి… ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండి తోడ్పాటును అందిస్తాం…ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 32 నుండి 40 సంవత్సరముల పాటు అంకిత భావంతో అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. పోలీసు డిపార్టుమెంటు నందు పనిచేయడం సవాలు తో కూడుకొన్నదని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధత తో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. విధుల్లో చేరిన నాటి కాలంలో అప్పటి పరిస్థితులను తట్టుకుని కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించడం మామూలు విషయం కాదన్నారు. పదవీ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.
మీ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని, మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క ఈ ప్రయాణం సుఖ సంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబం లో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు.స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం నందు జూలై నెలలో పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను ఎస్పీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలను మరియు విలువైన బహుమానాలను అందచేశారు.మమ్మల్ని ఘనంగా సత్కరించడం “ఆత్మీయ వీడ్కోలు” పలకడం, మా జీవితంలో ఎన్నటికీ మరువలేమని ఎస్పీ కి ధన్యవాదాలు తెలిపారు.పదవీ విరమణ పొందిన వారి వివరాలు(1) T . ఫిలిప్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్,G. No.960, నరసరావుపేట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ , పల్నాడు జిల్లా.
2) ఆర్య స్వర్ణలత దేవి, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ G.No.2069, చిలకలూరిపేట రూరల్ PS.
3) G. Yohan, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ G.No. 2786, అచ్చంపేట PS.
4) K . చిన్న పుల్లా రావు, HC 2052, పిడుగురాళ్ళ PS, పల్నాడు జిల్లా.ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు R . రాఘవేంద్ర ,అడిషనల్ ఎస్పీ(అడ్మిన్), CH. లక్ష్మీపతి ,అడిషనల్ SP(Crime), రామచంద్ర రాజు , అడిషనల్ SP (AR), గాంధీ రెడ్డి DSP, AR, ., డిస్ట్రిక్ట్ పోలీసు కార్యాలయం A.A.O. KVD రామారావు , DCRB CI A. అశోక్ కుమార్ , RI వెల్ఫేర్ గోపినాథ్ , RI అడ్మిన్ రాజా , RI MTO S. క్రిష్ణ RI DSW యువరాజ్ , పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు
T. మాణిక్యాల రావు , మరియు అధికారులు, సిబ్బంది పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.