నారద వర్తమాన సమాచారం
ప్రకృతి విలయతాడవం.. మృత్యు వలయం
ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశింపజేసే వయనాడ్ తాజా విపత్తుతో అతలాకుతలమైంది. ప్రకృతి ప్రకోపానికి చాలా గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల మంది బురద, కొండల కింద కూరుకుపోయారు. ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షం వారి జీవితంలో ఊహకు అందని విధ్వంసాన్ని మిగిల్చింది. ఊరేదో, వల్లకాడేదో గుర్తుపట్టలేనంతగా మృత్యు విలయం సృష్టించింది. పర్యాటకానికి మణిహారం లాంటి కేరళ ఇప్పుడు బాధితుల ఆర్తనాదాలతో అల్లాడుతోంది.
కేరళలో ప్రళయం.. 163కి చేరిన మరణాలు
కేరళలోని వయనాడ్లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య 163కి చేరింది. ఇంకా 85 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. భారత సైన్యంతో పాటు NDRF బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి జార్జి కురియన్ తెలిపారు. 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా ఇప్పటివరకు 89 మృతుల వివరాలను గుర్తించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.