కస్తూర్బా కళాశాల విద్యార్థులకు షీ టీం,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్, సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు…
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా
రామారెడ్డి మండలంలోని కస్తూర్బా కళాశాల యందు కళాబృందం,షీ టీం కామారెడ్డి, మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వారు విద్యార్థులను ఉద్దేశించి సైబర్ క్రైమ్ షీ టీం రోడ్ సేఫ్టీ మరియు అండ్ హ్యూమన్ ట్రాఫిక్ గురించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలకు షీటీం గురించి, సైబర్ నేరాల గురించి మూడ నమ్మకాలు గురించి, రోడ్డు భద్రత గురించి, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా నిర్మూలన మరియు డ్రగ్స్, మత్తు పదార్థాలు గురించి అవగాహన కల్పించనైనది. షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1 9 3 0 కు కాల్ చేసి వినియోగించుకోవలని చెబుతూ, అత్యవసర పరిస్థితుల టోల్ ఫ్రీ నంబర్100, 108, 1930, 181 ల విలువలు తెలుపనైనది. ఇట్టి కార్యక్రమానికి కళాబృందం సభ్యులు ప్రభాకర్ సాయిలు శేషారావు మరియు చ షీ టీం సిబ్బంది సిబ్బంది సౌజన్య, భూమయ్య , రామారెడ్డి ఏఎస్ఐ రవీందర్ & సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.