నారద వర్తమాన సమాచారం
పేదవారికి నిబద్ధతతో సంక్షేమం అందించేది కూటమి ప్రభుత్వం.
సాక్షి పత్రిక వ్రాసే తప్పుడు రాతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.::ప్రత్తిపాటి పుల్లారావు.
పేద ప్రజలకు నిబద్ధతతో సంక్షేమం అందించేది కూటమి ప్రభుత్వం అని మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. గురువారం ఉదయం పట్టణంలోని 19,12,11 వార్డులలో,పేట మండలంలోని వేలూరు, కుక్కపల్లివారి పాలెం, యడ్లపాడు మండలంలోని సందెపూడి, జాలాది మరియు నాదెండ్ల మండలంలోని చందవరం, సాతులూరు గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రత్తిపాటి పుల్లారావు మరియు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి తోట రాజా రమేష్ లు పాల్గొనడం జరిగింది. పట్టణంలోని 3 వార్డులలో, మండలాల పరిధిలోని 6 గ్రామాలలో 50 మంది లబ్ధిదారులకు వారి గృహాల వద్దకు వెళ్లి పెన్షన్లు ను స్వయంగా ప్రత్తిపాటి పుల్లారావు మరియు రాజా రమేష్ లు అందించడం జరిగింది.ఈ సంధర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో పెంచిన 1000 రూపాయలు మొత్తాన్ని 5 సంవత్సరాలు విడతల వారీగా అందిస్తే, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తొలి నెలలోనే 1000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాకుండా, గడచిన 3 నెలలకు కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పెన్షన్ 4000 రూపాయల మొత్తంలో 3000 మొత్తాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయంలోనే పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.అలాగే ఈ నెల కూడా 2800 కోట్ల రూపాయలు మొత్తాన్ని కేవలం ఒక్క రోజులో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారని,96 శాతం లబ్దిదారులకు ఈ ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రమూ అనుకూలంగా లేకపోయినప్పటికీ,చిత్తశుద్ధితో సంక్షేమాన్ని అమలు పరుస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక, సాక్షి టీవీ ద్వారా నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ, వినుకొండ పట్టణంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య పాత గొడవల కారణంగా జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని జగన్ వైఖరిని దుయ్యబట్టారు.
డిల్లీలో ధర్నాల పేరుతో డ్రామాలు మొదలు పెట్టి రాష్ట్ర ఇమేజ్ ను డామేజ్ చేయాలని చూస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆర్థికంగా రాష్ట్రాన్ని మరింత అధోగతి పాలు చేయాలని జగన్ కుట్ర పన్నారని తెలిపారు. సమర్ధుడైన పాలకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఢిల్లీ నుండి రాష్ట్రానికి ఏం సాధించగలరో,ప్రజలకు మొన్నటి బడ్జెట్ ద్వారా బాబు చూపించారని తెలిపారు.రాజధానికి 15000 కోట్లు సాధించిన విషయం, పోలవరం నిర్మాణం ఖర్చు మొత్తం తామే భరిస్తామని చెప్పిన విషయం, రాష్ట్ర రైల్వేకు 9000 కోట్లు కేటాయించిన విషయం, విభజన హామీలు మొత్తం అమలుపరచడానికి నిధులు కేటాయిస్తున్న విషయం సాక్షి పత్రికకు, వైసీపీ నేతలకు కనిపించకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగా ప్రత్తిపాటి పుల్లారావు అభివర్ణించారు. మీరు నాశనం చేసిన వ్యవస్థలను గాడిలో పెట్టి,ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు ఆ దేవుని ఆశీస్సులు కూడా తోడై రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా పడుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాలు నిండుతున్నాయని తెలిపారు. సాక్షి పత్రిక తప్పుడు రాతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.