నారద వర్తమాన సమాచారం
విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి, ప్రశంసా పత్రాలు అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్.
తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తూ వృత్తి నైపుణ్యంతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణా మరియు అమ్మకాలకు అడ్డుకట్ట వేయుట, కోర్టు విధులను ప్రతిభావంతంగా నిర్వహించి వివిధ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయుట మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ సక్రమ నిర్వహణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనుటలో కృషి చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని గురువారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేసారు.
1. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ అనుగుణంగా ప్రకాశం జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో పోలీస్ అధికారులుమరియు సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించగా తేదీ 31.07.2024 న సింగరాయకొండ పీఎస్ లో Cr.No.250/2024, u/s 8 (c) r/w 20 (b) of NDPS Act ప్రకారం కేసు నమోదు చేసి గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి దానిని చెన్నై, నెల్లూరు, ఒంగోలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకొని ఎక్కువ లాభాలు పొందుతున్న 8 మంది పట్టుకొని వారి నుండి 40 kg ల గంజాయి, కారు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవటంలో ప్రతిభ కనపర్చిన సింగరాయకొండ SI T. శ్రీరామ్, ASI Ch.శేషారెడ్డి, HC తిరుపతి స్వామి, PCలు విజయ్ కుమార్, శ్రీనివాస రావు, శ్యాం సుందరం, HG బాలరాజు, ఒంగోలు టు టౌన్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఖాజావళీ, కానిస్టేబుల్ కోటేశ్వరరావు లను
2. అక్రమ సంబంధం తెలుసుకున్న భర్త అడ్డు తొలిగించుకోవాలని భార్య మరియు అత్త ప్రియుడుతో హత్య చేయించిన ఘటనలో కురిచేడు పీఎస్ లో క్రైమ్ నెంబర్:43/2015 u/s 120(B ), 302 IPC, sec 3(2)(V) SC,ST (POA) Act కేసులో ముగ్గురు నిందితులకు జీవితఖైదు మరియు రూ.1,000/- జరిమానా విధించుటలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన SB సీఐ కె.వి.రాఘవేంద్ర, కోర్టు లైజన్ హెడ్ కానిస్టేబుల్ ఏ.శ్రీనివాసులు, కురిచేడు కోర్ట్ కానిస్టేబుల్ సుభాని లను
3. భార్యని హత్య చేసిన ఘటనలో మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో Cr.No.08/2019 U/s 498(A ), 302 IPC క్రింద నమోదైన కేసులో నిందితునికి యావజ్జీవ ఖైదు మరియు రూ.2000 జరిమానా విధించుటలో క్రియాశీలకంగా విధులు నిర్వర్తించిన అప్పటి మార్కాపురం సీఐ శ్రీధర్ రెడ్డి, కోర్టు లైజన్ హెడ్ కానిస్టేబుల్ ఐ.వి.శ్రీనివాసరావు మరియు మార్కాపురం కోర్టు కానిస్టేబుల్ భాస్కరరావులను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను (GSE) అందజేశారు. మార్కాపురం సీఐ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందచేశారు.
4. పోలీస్ స్టేషన్ లు యొక్క సిబ్బంది పనితీరు,రికార్డ్స్ సక్రమ నిర్వహణ, మరియు పరిసరాలను క్లీన్ & గ్రీన్ గా ఉంచుకొనుటలోకృషి చేసిన దర్శి ఎస్సై సుమన్, మర్రిపూడి ఎస్సై శివబసవరాజు లను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను(GSE) అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.