నారద వర్తమాన సమాచారం
వృక్ష సంపదను పెంచేందుకు ప్రభుత్వం ఈనెల 5 నుంచి 9 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి :జీ హెచ్ యం సి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న
ఎల్ బీ నగర్
హైదరాబాద్
వృక్ష సంపదను పెంచేందుకు ప్రభుత్వం ఈనెల 5 నుంచి 9 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీ హెచ్ యం సి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాని పురస్కరించుకుని చాంద్రాయణగుట్ట నర్కి పూల్ బాగ్ లోని జోనల్ కార్యాలయం లో శనివారం జోనల్ కమిషనర్ అన్ని విభాగాలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించే స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమానికి సర్కిల్ డిసిల పర్యవేక్షణలో ఆరోగ్యం పారిశుద్ధ్యం, యు సి డి, అర్బన్ బయోడైవర్సిటీ, టాక్స్, ఎంటా మలజీ విభాగాల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా 5 వ తేదీన పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి బస్తీలు, కాలనీ, వాణిజ్య సముదాయాలు , ఆర్టీసీ బస్టాండ్ లు , రైల్వే స్టేషన్స్, స్మశాన వాటికలు, పార్కులో ప్లే గ్రౌండ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. 6 న దోమల కట్టడికి, ఫాగింగ్, వీధి కుక్కల బెడద నివారణ చర్యలపై కార్యక్రమం, 7 న నీటి నిల్వలు, చెరువులు బావులు పరిశుభ్రత, 8 న డ్రైనేజీ, నాలాల పుడిక తీత పనులు, కమ్యూనిటీ హాళ్ల నిర్వహణ పై కార్యక్రమం ఉంటుందన్నారు. చివరి రోజు 9 న వన మహోత్సవం సందర్భంగా అన్ని బస్తీలు కాలనీలో, విద్యాసంస్థలు, ఇతర ప్రాంతాల్లో మొక్కలను పంపిణీ చేసి… ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నామన్నారు . ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు జయంత్, సురేందర్,సరిత, శ్రీనివాస్ రెడ్డి రవికుమార్ , ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, టౌన్ ప్లానింగ్ సీ పి శ్యామ్ కుమార్, ఈఈ లు నరేందర్ గౌడ్, హరి కిషోర్, పీర్ సింగ్, ఏకంబరం, ప్రకాశం, రవాణా విభాగం డీ సీ టి ఓ వినయ్ భూషణ్, ఈ సిడి డిపిఓ లు రాధమ్మ,యుగంధర్ రెడ్డి, డి ఈ లు, యు బి డి, ఎలక్ట్రికల్ , ఆరోగ్యం, పారిశుధ్యం విభాగం, అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.