నారద వర్తమాన సమాచారం
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీని కలిసి… ఈ ఫ్లైఓవర్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే 65పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
మరోవైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.