నారద వర్తమాన సమాచారం
నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాక
శ్రీకాకుళం :
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం లోని తన స్వగృహానికి చేరుకుంటారని, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన జిఎం, డిఆర్ఎంలతో సమీక్ష నిర్వహిస్తారని, మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ సన్రైజ్ కు చేరుకుంటారని చెప్పారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ, అలింకో నిర్వహించే దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుంటారని చెప్పారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.