జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య సేవలు
నారద వర్తమాన సమాచారం,
అర్మూర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గల ప్రముఖ ఆసుపత్రి గంగ హాస్పిటల్ లో డాక్టర్ అమృత్ రాంరెడ్డి నిర్వహించిన విలేకరుల ఉచిత వైద్య శిబిరంలో ఆర్మూర్ పట్టణంలో గల జర్నలిస్టులకు ఉచిత గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించడం నిర్వహించారు. గతంలో ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహించడం జరిగింది. పాత్రికేయులకు ఈసీజీ , టు డిఈకో వైద్య పరీక్షలను నిర్వహించారు. అలాగే గతంలో రక్త పరీక్షలు చేసుకున్న వారికి అయుక్ష హాస్పిటల్ డాక్టర్ చంద్ర మోహన్ జనరల్ ఫిజీషియన్ చే వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అమృత్ రాంరెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించి వార్తలను అందించే పాత్రికేయులకు గంగా హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య సేవలను అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత వ్యాధులతో హఠాత్ పరిణామంగా మరణాలు సంభవిస్తున్నాయి దానిని దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టుల ఆరోగ్యం దృశ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు .డాక్టర్ భైరవనాధ్,డాక్టర్ గౌతంరెడ్డిలు మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి ఆధారంగా ప్రజలందరూ తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ,శారీరక శ్రమ కచ్చితంగా చేయాలని సూచించారు. మునుముందు పాత్రికేయులకు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా సేవలందించేందుకు ముందుంటామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జర్నలిస్టులకు వైద్య సేవలు అందించిన డాక్టర్ల బృందానికి ఆర్మూర్ జర్నలిస్టులు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఫుడెన్స్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ అనస్తీసియా డాక్టర్ భైరవనాథ్, కార్డియాలజీ వైద్యులు డాక్టర్ గౌతమ్ రెడ్డి అకిడి , డాక్టర్ వంశీకృష్ణ కొత్తూరు మరియు ఆర్మూర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.