నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా…
పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు సీఐ వెంకటరావు
పట్టణంలోని ఆటో డ్రైవర్ల అందరిని స్టేషన్ ఆవరణలో సమావేశ పరిచారు,
అనంతరం సిఐ వెంకటరావు మాట్లాడుతూ, పట్టణంలోని
ఆటో డ్రైవర్లందరూ విధిగా యూనిఫామ్ ధరించాలి,
మద్యం సేవించి ఆటో నడపకూడదు.
ఆటో డ్రైవర్ల అందరూ లైసెన్స్ కలిగి ఉండాలి.
వారికి నిర్దేశించిన ఆటో పాయింట్లలో మాత్రమే ఆటోలు నిలపాలి.
ఐదుగురు మాత్రమే ఆటోలో ఎక్కించాలి,
మితిమీరి ఆటోలో ఎక్కువగా ప్రజలను ఎక్కించరాదు.
అలా కాకుండా ఎక్కడబడితే అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఆటోలు నిలుపరాదు.
రాత్రిపూట ఆటోలు నడిపే వారు ముందుగా పోలీస్ స్టేషన్ లో, ఆటో డ్రైవర్ పేరు, లైసెన్స్, ఫోన్ నెంబర్, తప్పనిసరిగా స్టేషన్ కు వచ్చి సమాచారం తెలియజేయాలి,
పైన తెలిపిన ఏ ఒక్కటి సరిగా లేకపోయినా, రూల్స్ ను
అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.