నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశానుసారం మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు వారి సూచనల మేరకు పిడుగురాళ్ళ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ యమ్. మురళీ గంగాధర రావు ఆధ్వర్యములో మానసిక వికలాంగులకు న్యాయ అవగాహనా సదస్సు ది.03.08.2024 శనివారం స్థానిక సూర్య కిరణ్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, నిమ్మతోట బజార్, పిడుగురాళ్ళ పట్టణం నందు నిర్వహించడం జరిగినది. ఈ న్యాయ అవగాహనా సదస్సు నందు న్యాయమూర్తి యమ్. మురళిగంగాధర రావు మాట్లాడుతూ NALSA (మానసిక అనారోగ్యం మరియు మానసిక వికలాంగులకు చట్టపరమైన సేవలు) స్కీమ్, 2015’ని అమలు చేయాలని మరియు వారికి గల న్యాయ పరమైన హక్కులు తెలియజేసి, వారికి మంచి సదుపాయాలు అందుచున్నయా లేదా మరియు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందుచున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న బార్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ కె. కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు వారు ఎంతో భాధ్యత తీసుకొని దివ్యంగులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారని కొనియాడారు. అలాగే వారికీ తగిన సదుపాయాలను తప్పకుండ అందించాలని సూర్య కిరణ్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ కి తెలియజేసారు. పిడుగురాళ్ల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఉడత కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ వున్న దివ్యాంగులకు సేవ చేయడం మాధవసేవ గా అభివర్ణించారు.
ఈ కార్యక్రమములో న్యాయవాదులు ఏ. ఋల్బెనియన్, సెక్రటరీ కోపూరి వెంకటేశ్వర్లు, మందా జాకబ్, వెలిశల రామకృష్ణ, ఎస్వీ కోటేశ్వరరావు, ఆయాజ్ అహమద్, హనుమ నాయక్, కోర్టు సిబ్బంది, స్వచ్చంగా సంస్థ సహాయకులు తాడేపల్లి నాగేశ్వరరావు, అతూకూరి ఉపేంద్ర, కోర్ట్ కానిస్టేబుల్స్, పారా లీగల్ వాలంటీర్ వి. నాగార్జున మరియు సూర్య కిరణ్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ డి.వి. రవీంద్ర ప్రసాద్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమును విజయవంతం చేసిన బార్ అసోసియేషన్ సభ్యులకు న్యాయమూర్తి ఎమ్.మురళి గంగాధరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.