నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే..
ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్.. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.. ప్రజలకు సేవలందించే విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేయనున్నారు.. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడే తిప్పి కొట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నారు.. తాను జిల్లాల పర్యటనలకు వచ్చేటప్పుడు అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకోవద్దని.. ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని మరోసారి స్పష్టం చేయబోతున్నారు సీఎం..
అయితే, ఈ కలెక్టర్ల సమావేశానికి ఓ ప్రత్యేకత ఉంది.. విభజన జరిగిన పదేళ్ల కాలంలో తొలిసారి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది.. 2014-19 మధ్య కాలం తొలి రోజుల్లో హోటళ్లల్లో, ఆ తర్వాత ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించేవారు.. ఇక, గత ప్రభుత్వంలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు అప్పటి సీఎం.. గత ప్రభుత్వంలో తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ప్రజా వేదికలో నిర్వహించిన నాటి సీఎం జగన్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజా వేదికను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సచివాలయంలో సరైన వేదిక లేకున్నా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.. ఫంక్షన్ హాళ్లు.. హోటళ్లల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి అంగీకరించని సీఎం చంద్రబాబు.. అనవసరపు ఖర్చు వద్దని స్పష్టం చేశారు.. సచివాలయంలోనే సర్దుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని సీఎం చెప్పడంతో.. సచివాలయంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.