స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం
అర్మూర్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 23 వ 10 వ వార్డులో జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అంకిత్ ప్రారంభించడం జరిగింది .కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మునిసిపల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ఈనెల 5వ తేదీ నుండి 9 వ తేదీ వరకు వివిధ రకాలుగా కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు ,సీనియర్ నాయకులు పండిత్ పవన్ ,మాజీ సర్పంచ్ గడ్డం మారుతి రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబాగౌడ్, కౌన్సిలర్లు కొంతoమురళి, శాల ప్రసాద్ ,ఆకుల రాము ,ఇట్టేడి నర్సారెడ్డి, డి.సి.సి.బి డైరెక్టర్ వాసు, నాయకులు శ్యామ్ గౌడ్ ,అజ్జు ,శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.