నారద వర్తమాన సమాచారం
దాచేపల్లి మండలంలోని కేసానుపల్లి గ్రామ శివారున ప్రత్తి పంటను గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మరియు ADA శ్రీకృష్ణ దేవరాయలు , దాచేపల్లి MAO పాపకుమరి పిడుగురాళ్ల MAO శ్రీనివాస రెడ్డీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కేసానుపల్లి,దాచేపల్లి మండలం శివారులో లింగ.వెంకటేశ్వర్లు ప్రత్తి పంటను పరిశీలించారు పచ్చ దోమ ఆకుల రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు ఎరుపు రంగులోకి మారి ఆకులు పైకి ముడుచుకు పోవాలి అని పేర్కొన్నారు. దీనినే రైతుల వ్యవహారిక భాషలు ఎర్రబొమ్మిడి తెగులు అని పిలుస్తున్నారు. మే నెలలో కత్తివేసిన వారు నివారణ చర్యలు తీసుకోవడం అంతా లాభదాయకం కాదని అయితే లేత పైరులో ఇది ఉంటే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లూదికామిడ్ లీటరు నేటికీ 0.3 గ్రాములు చొప్పున ఎకరాకు 60 గ్రాములు చేయాలని లేదా డయాఫెన్థియాన్ లీటర్ నీటికి 1.25 గ్రాములు చొప్పున ఎకరాకు 250 గ్రాములు పిచికారి చేయాలని లేదా థయో మిధాక్సం 0.3 మి.లీ లీటరుకు నీటిని పిచికారి చేయాలని పొటాషియం నైట్రేట్ కూడా పిచికారి చేయాలని Ada శ్రీకృష్ణ దేవరాయలు మరియు mao దాచేపల్లి పాప కుమారి సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.