నారద వర్తమాన సమాచారం
శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు – టీటీడీ
తిరుమల, 2024 ఆగస్టు 06: ఆన్లైన్లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్య వర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
ఇటీవలి వెరిఫికేషన్లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించబడింది. అటువంటి వాటినీ బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వార్డ్ చేసింది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది.
దర్శనం, సేవలు, వసతి బుకింగ్లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తోంది. అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.