నారద వర్తమాన సమాచారం
ఆకలి….
అప్పట్లో నేను చదివిన ఒక చిన్న కథ
హృదయాన్ని ద్రవింపజేసే వాస్తవ కథ
దయచేసి రెండు నిమిషాలు కేటాయించి పూర్తిగా చదవండి….
ఒక ఊరిలో ఒక నిరుపేద కుటుంబం.. పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి , నెల రోజుల నుంచి పని లేక ఆకుటుంబం పస్తులు ఉన్నారు , ఆకలి బాధ తట్టుకోలేక ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి విగత జీవి అయి మరణించాడు , మరణించిన వాళ్ళ ఇంట్లో వంట చేసుకోరు అక్కడ ఆనవాయితీ కాబట్టి రోజు ఒకరు చొప్పున వాళ్ళ చుట్టాలు వంట చేసి పంపడంతో ఒక పది రోజులు వాళ్లకి భోజనం దొరికింది , మళ్లీ ఆపది రోజుల తర్వాత ఆకలి భూతం మరో నెల తర్వాత మళ్లీ మరొక వ్యక్తి ఆ కుటుంబం నుంచి విగత జీవి అయి మరణించాడు , మళ్లీ చుట్టాలు వంతుల వారిగా వాళ్లకి పది రోజులు భోజనం అందించారు , మళ్లీ ఆకలి పని దొరకట్లేదు కొద్దిరోజులు పస్తూ ఉన్న తర్వాత , ఆ ఇంట్లో ఉన్న చిన్నబాబు తన తల్లిని అమాయకంగా అడిగాడు , …. అమ్మ మన ఇంట్లో మరొకరు ఇంకెప్పుడు చనిపోతారు అని , ఎందుకు అని అమ్మ అడిగిన ప్రశ్నకి ఆ చిన్న బాబు చెప్పిన బదులు సమాధానం… మళ్లీ మనకి పది రోజులు భోజనం దొరుకుతుంది కదా అని…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








