కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ నీ ప్రారంభించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐ పి ఎస్ , అనంతరం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి
జిల్లా ఏస్పి సింధు శర్మ ఐపీఎస్ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు బాగున్నాయని, ఇలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు.
అనంతరం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ నీ ప్రారంభించి, స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం జరిగింది. జిల్లాలో మొదటి సారిగా, ఎక్కడా లేని విధంగా పట్టణ పోలీసు స్టేషన్ లో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసిన పట్టణ SHO చంద్ర శేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ని ఎస్పీ ప్రత్యేకముగా అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి , కామారెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్ , టౌన్ SHO చంద్రశేఖర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ సిఐ తిరుపతయ్య మరియు సిబ్బంది, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.