నారద వర్తమాన సమాచారం
భారత ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్ ఆర్ పి ఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ….
ఈ సందర్బంగా ఆత్మీయంగా మంద కృష్ణ మాదిగ ని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపిన . నరేంద్ర మోడీ…
మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష, మూడు దశాబ్ధాల ఉద్యమ ఆశయం, సామజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమైన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఉద్యమం విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాల అండగా నిలిచిన భారతదేశ ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ కి MRPS అధినేత మంద కృష్ణ మాదిగ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి మంద కృష్ణ మాదిగ ని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరిందుకు మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీ ఎంతో అనురాగంతో,ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించి మంద కృష్ణ మాదిగ ఎడల, అలాగే MRPS ఉద్యమం పట్ల మరియు మాదిగ జాతి ఎడల తన ఉన్నకున్న ప్రేమను వ్యక్తపరిచారు.
ప్రధానమంత్రి తన ఛాంబర్ లో మంద కృష్ణ మాదిగ ని కూర్చోబెట్టుకొని కూలంకషంగా అనేక విషయాలు మాట్లాడం జరిగింది.
ఈ కలయిక ఒక చారిత్రక ఘట్టం….
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి-( MRPS)
Discover more from
Subscribe to get the latest posts sent to your email.