నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ళ
పబ్లిక్ హెల్త్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పిడుగురాళ్ల ఆధ్వర్యంలో శనివారం పిడుగురాళ్ల పట్టణం ఆరవ వార్డులోని ఎస్టీ ఏరియా నాలుగవ సచివాలయం నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు అనీమియా, జాయింట్ డిజార్డర్స్, హెచ్ టి ఎన్ వ్యాధులకు సంబంధించి ఉచిత మందులు ఇవ్వడం జరిగిందని డాక్టర్ కే మేఘమాల తెలిపారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి స్థానిక ప్రజలకు అవగాహన ఇవ్వడం జరిగిందనిడాక్టర్ మేఘమాల తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డి ప్రభు ప్రసాద్, డి బాబు, హనుమంతరావు నాయక్, కోటేశ్వరమ్మ, వార్డు ఏఎన్ఎం సీతామహాలక్ష్మి, ఆశా వర్కర్లు సచివాలయ అడ్మిన్ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.