నారద వర్తమాన సమాచారం
ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐ పీ ఎస్.”
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీకంచి శ్రీనివాసరావు, ఐపీఎస్.”
ఈ ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో, కొండమోడు గ్రామానికి చెందిన ఫిర్యాది యొక్క భర్త చనిపోయినట్లు, అప్పటి నుండి సుభాష్ అను వ్యక్తి పరిచయం అయినట్లు, ఫిర్యాది కి మాయ మాటలు చెప్పి, 5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు, ఇప్పటికి శారీరకముగా, మానసికముగా భాధపడుతున్నట్లు రిపోర్ట్.
కుందేటి రామాంజనేయులు 5/0 ఏడుకొండలు అను ఫిర్యాది కి రొంపిచెర్ల లో పొలము ఉన్నట్లు, ఆ పొలము లో నువ్వులు పంట వేసినట్లు, పంట వచ్చిన తరువాత ఎండ బెట్టినట్లు, ఆ తరువాత పొలము లోనికి వెళ్లి చూడగా కోటేశ్వరరావు అను వ్యక్తి పంటను నాశనం చేసినట్లు రిపోర్ట్
నడికుడి గ్రామానికి చెందిన షేక్ నసార్ బి w/o బాల మీరవాలి అను ఫిర్యాది కి 13.సం. క్రితం విహాహం అయినట్లు, 4 గురు అమ్మాయిలు సంతానం ఉన్నట్లు, ఫిర్యాది భర్త ఆమెను శారీరకముగా మానసికము గా హింసిస్తున్నట్లు, అదనపు కట్నం కోసం వేదిస్తున్నట్లు రిపోర్ట్.
గణపవరం గ్రామము, నాదెండ్ల మండలం కి చెందినా చల్లగుండ్ల శివ ప్రసాద్ S/O రామరావు అను వ్యక్తి దగ్గర కంబెర్ల నరేంద్ర అను వ్యక్తీ మరియు రాధిక అను ఆమె కలిసి సుమారుగా 75 లక్షలు వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకొని, తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్ట్.
జులాది గ్రామము, యడ్లపాడు మండల
మ
ు చెందిన కురాకుల రమేష్ s/o ఆనందరావు ఆను వ్యక్తి వద్ద ఉన్న రెండు ట్రాక్టర్ లు 9 నెలల క్రితం మన్నెం సుందరం అను వ్యక్తి తీసుకొని, ఫైనాన్సు కడుతానని చెప్పి, ట్రాక్టర్ లు ఇవ్వకుండా, ఫైనాన్సు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్ట్
నూజెండ్ల మండలం, కంభంపాడు గ్రామము కి చెందినా మేదరమెట్ల బ్రహ్మానందం అను వ్యక్తీ యొక్క 17 సెంట్ల భూమి ని తన సరిహద్దు దారులైన మేదరమెట్ల కోటిశ్వరరావు మరియు మేదరమెట్ల శ్రీనివాసరావు ఆక్రమించుకున్నట్లు ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్.
నరసరావుపేట, ప్రకాష్ నగర్ కు చెందిన కందికట్టు కోటిశ్వరరావు బందరు శ్రీకాంత్ అను వ్యక్తి జాబు ఇప్పిస్తానని చెప్పి లక్ష యాభై వేల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు రిపోర్ట్,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.