నారద వర్తమాన సమాచారం
గుంటూరు శ్రీ చౌడేశ్వరి ఆలయంలో 19న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట 17 నుంచి మూడు రోజులపాటు కల్యాణ వైభవ పూజలు
గుంటూరు,
గుంటూరు నల్లపాడు రోడ్డు సాయి నగర్ లోని శ్రీ మహాగణపతి శ్రీ కుమారస్వామి సహిత శ్రీ చౌడేశ్వర చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో ఈనెల 19వ తేదీన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కృతువు మరియు కళ్యాణ మహోత్సవం వైభవపీతంగా జరగనున్నది. ఈ సందర్భంగా 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు కల్యాణ వైభవ పూజలు జరగనున్నాయని ఆలయ సర్వాధికార ప్రతినిధి శ్రీశ్రీశ్రీ విశ్వంభరానందగిరి స్వామి తెలిపారు. శ్రీ వశిష్ట హర రామ జన యజ్ఞ ఆశ్రమ పీఠాధిపతుడు శ్రీశ్రీశ్రీ ప్రణవానందగిరి స్వామి ఆశీస్సులతో ఆలయ శాశ్వత ధర్మకర్త కొమ్మన నరసింహారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర రావు, స్థానిక శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
*ఆలయ విశిష్టత*
శ్రీ విశ్వంభరానంద గిరి స్వామి పూర్వశ్రమంలో ఒలుకుల శివశంకరరావు తిమ్మసముద్రం శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో అధ్యాపకునిగా… ప్రిన్సిపల్ గా పని చేస్తూ అష్టావధాని…. శతావని…. సహస్రనావధానిగా రాణించారని తాను 1977 81 మధ్య కాలంలో ఆయన వద్ద శిష్యునిగా ఉన్నానని సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు తెలిపారు. ప్రస్తుతం వీరి హయంలో శ్రీ చౌడేశ్వరి ఆలయం ఎంతగానో దినదినాభివృద్ధి చెందుతున్నదని నిమ్మరాజు అన్నారు. భారతదేశంలో తొలిసారిగా 23 కోట్ల శ్రీవిద్య బీజాక్షరములను చిత్తం చేయబడిన 27 అడుగుల ఎత్తులో నిర్మితమైన స్తూపం పై రెండు అడుగుల శ్రీ చక్రం ప్రతిష్టించబడిన చరిత్ర ఈ శ్రీ చక్రాలయం కు ఉందని నిమ్మరాజు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.