నారద వర్తమాన సమాచారం
ఢిల్లీలో ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశం
న్యూ ఢిల్లీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు .. ప్రధాని మోడీతో నిన్న సాయం త్రం సమావేశం అయ్యారు. దాదాపు గంట పాటు వీరి భేటీ కొనసాగింది.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయా నిధుల మంజూరుపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది.
అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నిధుల విడుదలపైనా చంద్రబాబు.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లి నట్లు సమాచారం.
అంతేకాకుండా వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.
జగన్ హయాంలో చేసిన రుణాలను రీ షెడ్యూల్ చేయాలని మోడీని కోరారు చంద్రబాబు. మోడీ భేటీ అనంతరం.. హోం మంత్రి అమిత్‌షాను చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి నట్టు తెలుస్తోంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.