నారద వర్తమాన సమాచారం
మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కు తీవ్ర అస్వస్థత
కేరళ:-
ప్రముఖ మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మోహన్ లాల్ ని పరీక్షించిన వైద్యులు.. ఆయన తీవ్ర జ్వరం, కండరాల నొప్పుల తో పాటు ఊపిరి తీసుకోవ డంలో ఇబ్బందులు ఎదు ర్కుంటున్నట్టు గుర్తించారు.
అధికారిక మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. మోహన్ లాల్ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సోకిన వారికి శ్వాస తీసుకోవడం లో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి.
ఇప్పుడు హీరో మోహన్ లాల్ కూడా అలాంటి సమస్యతోనే బాధపడు తున్నారు. ఆయన మరో 5 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇటీవలే గుజరాత్ లో తన L2:ఇంపురాన్ అనే సినిమా షూటింగ్ ముగించుకుని కొచ్చికి వచ్చిన తరువాతే మోహన్ లాల్ అనారోగ్యం బారినపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.