నారద వర్తమాన సమాచారం
జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు ద్యిచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన స్టేషన్ ఎస్.హెచ్.ఓ.కె.వెంకట్రావు
పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా, గురజాల నియోజక వర్గం, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు. ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు పిడుగురాళ్ళ పట్టణంలో స్టేషన్ ఎస్ హెచ్ ఓ కె. వెంకట్రావు ఆద్వర్యంలో ద్యిచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మైనర్లు వాహనాలునడిపినా వారికి వాహనాలు ఇచ్చినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరియు వాహనాలను సీజ్ చేయబడతాయని.కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. అలాగే ద్యిచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ల యొక్క తల్లిదండ్రులను కూడా హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ,మోహన్ , ఏ ఎస్ ఐ .రామ్ ప్రసాదు ,మరియు ,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







